సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జనవరి 2024 (17:05 IST)

ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి.. వేలం వేస్తారా?

cock
ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడిని శుక్రవారం వేలం వేసేందుకు ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేశారు. అయితే కోడి తానదేనంటూ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు మహేష్ అనే వ్యక్తి.. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో దొరికిన కోడి నాదేనంటూ బాధితుడు వీడియో ద్వారా తన ఆవేదన వెల్లగక్కాడు. నెల్లూరు జిల్లాకు చెందిన మహేష్‌ బతుకుతెరువు కోసం రుద్రంగికి వచ్చినట్టుగా చెప్పాడు. పందెంకోడి వేలాన్ని నిలిపివేయాలని డిపో మేనేజర్‌ని వేడుకున్నాడు. 
 
కోడి యజమాని కూడా వేలం పాటలో పాల్గొనాలని కరీంనగర్ ఆర్టీసీ డిపో-2 మేనేజర్ నిర్లక్ష్య సమాధానం ఇచ్చాడంటూ మహేష్ వాపోయాడు. నాదే కోడి అంటూ సెల్ఫ్ వీడియో విడుదల చేయటంతో కోడి వేలం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.
 
ఆర్టీసీ నిబంధనల ప్రకారం.. లాస్‌ ఆఫ్‌ ప్రాపర్టీ కింద మరిచిపోయిన వస్తువుల గురించి సరైన ఆధారాలతో ఎవరూ రాకపోతే 24 గంటల తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేలం పాట నిర్వహించాల్సి ఉంటుందని డిపో-2 మేనేజర్‌ తెలిపారు.