1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 జనవరి 2024 (13:57 IST)

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు .. ఇద్దరు మృతి ... ఎక్కడ?

bus accident
ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సు ఒకటి లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం మోచర్ల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు కాగా, డ్రైవర్‌ వినోద్‌ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 
 
మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. వీరిలో సీతమ్మ (65) అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. టీఎస్‌ఆర్టీసీ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.