శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (13:09 IST)

పోలవరం హైడెల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు.. ఆశావర్కర్ల వేతనాలు పెంపు.. ఏపి కేబినెట్ నిర్ణయం

వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏపీ మంత్రివర్గం బుధవారం సమావేశమైంది. ఈ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అవేంటో పరిశీలిద్ధాం. 
 
* నవయుగకు పోలవరం హైడల్‌ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపింది. 
* రూ.3216.11 కోట్ల టెండర్‌ రద్దుకు కేబినెట్‌ ఆమోదం. 
* రివర్స్‌ టెండరింగ్‌ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్‌ ఆమోదం.
* కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కేబినెట్‌ ఆమోదం.
* మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.
* ఆశావర్కర్ల వేతనం పెంపునకు కేబినెట్‌ ఆమోదం. రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. 
 
* 2018 ఆగస్టు నుంచి రూ.1500 ఉన్న ఆశావర్కర్ల జీతం రూ.3 వేలకు పెంపు. మరో 3 వేల రూపాయలు ప్రతిభ ఆధారంగా నిర్దేశించిన అప్పటి ప్రభుత్వం ఆశావర్కర్ల జీతాలను నేరుగా రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం.
* మచిలీపట్నం పోర్టు ప్రైవేటు లిమిటెడ్‌కు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయానికి ఆమోదం.