మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 ఫిబ్రవరి 2023 (17:07 IST)

మహా శివరాత్రి... ప్రజలకు తెలుగు రాష్ట్రాల సీఎంల శుభాకాంక్షలు

Lord Shiva
మహా శివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర , దేశ ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
 
ఉపవాసం, రాత్రంతా జాగారం చేయడం, భక్తిశ్రద్ధలతో శివ నామస్మరణతో పూజలు, అభిషేకాలు చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మశుద్ధి, పరివర్తనను కలిగిస్తాయని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.
 
శివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. శివుని కరుణ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.
 
లయకార, అర్ధనారీశ్వరుడు అని పిలుచుకునే మహాదేవుని ఆశీస్సులతో అందరి జీవితాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కూడా మహా శివరాత్రి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శివుని రోజు శుభప్రదం. మనమందరం పార్వతీ దేవి ఆశీస్సులు పొందాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.
 
లక్షలాది మంది శివ భక్తులకు ఇది అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన ఆధ్యాత్మిక పండుగ అని, ఈ రోజును ఉత్సాహంగా, భక్తితో పాటిస్తారు. "మీ అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు, ఆ పరమశివుని ఆశీస్సులు మనందరికీ కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను" అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్వీట్ చేశారు.