మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (16:39 IST)

కో డైరక్టర్ లొంగదీసుకున్నాడు.. పెళ్లికి మాటెత్తేసరికి పారిపోయాడు.. చివరికి?

బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పెనుదుమారం రేగుతోంది. హాలీవుడ్‌లో ''మీ టూ'' ఉద్యమం జోరుగా నడుస్తోన్న తరుణంలో.. మంచి రోల్స్ ఇప్పిస్తానని లొంగదీసుకున్న ఓ కో డైరక్టర్.. ఓ యువతిని మోసం చేశాడు. దీంతో బాధితుర

బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పెనుదుమారం రేగుతోంది. హాలీవుడ్‌లో ''మీ టూ'' ఉద్యమం జోరుగా నడుస్తోన్న తరుణంలో.. మంచి రోల్స్ ఇప్పిస్తానని లొంగదీసుకున్న ఓ కో డైరక్టర్.. ఓ యువతిని మోసం చేశాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. సినిమాల్లో నటించాలనే కలలతో హైదరాబాద్ చేరిన శ్రీకాకుళం యువతికి స్టేషన్ ఘన్ పూర్ ప్రాంతానికి చెందిన సినీ కో డైరక్టర్ పి. రాజశేఖర్ పరిచయం అయ్యాడు. ఈ పరిచయంతో ఆ యువతికి మంచి ఛాన్సులు ఇప్పిస్తానని నమ్మించాడు. ఆపై లొంగదీసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 
 
అయితే వివాహం చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయడంతో చేతులెత్తేశాడు. అంతేగాకుండా ఆమెకు దూరమైనాడు. ఈ ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.