గురువారం, 13 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: బుధవారం, 15 జులై 2020 (17:16 IST)

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ముగిసింది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
 
ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. ఈ అధ్యయన కమిటీ వచ్చే ఏడాది మార్చి31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రక్రియ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీ ప్రతి పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై, అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
 
దీంతో ప్రభుత్వం 13 జిల్లాలను పునవ్యవస్థీకరించి 25 జిల్లాలను ఏర్పాటు చేయనుంది. కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా 4 జిల్లాల్లో అంతర్భాగమై ఉన్నది. ఈ నేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని ఛీప్ సెక్రటరీ ముఖ్యమంత్రికి సూచించారు.