శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (17:35 IST)

కొరోనా అనేది చాలా చాలా వీక్ వైరస్: Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh

ప్రశ్న: డాక్టర్ గారూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ హాస్పిటల్కి వెళ్లగలిగే పరిస్థితి లేదు.కానీ Home Isolationలో ఉన్న వాళ్లు హాస్పిటల్ అయితే ఎలాంటి పరిస్థితి వచ్చినా ట్రీట్మెంట్ అందుతుంది.ఇంట్లో ఉండటం వల్ల ఏదైనా ప్రమాదము అవుతుందేమో అన్న భయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు... అలాంటివారి కోసం మీరేమి సలహా ఇస్తారు?
 
సమాధానం: కోవిడ్ వచ్చిన వారికి వైరస్ కన్నా వారికున్న భయమే ఎక్కువ నష్టం కలగ చేస్తోంది.
కొరోనా అనేది చాలా చాలా వీక్ వైరసు, 1%కన్నా తక్కువ మరణాలు నమోదవుతున్నాయంటేనే దాని శక్తి ఏంటో తెలిసిపోతుంది. ఈ వైరస్ బారిన పడిన వాళ్లలో 80%మందికి అసలు హాస్పిటల్ అవసరమే రాదు.10% మందికి మాత్రమే వెంటిలేటర్ అవసరం పడుతుంది.
 
కోవిడ్ పాజిటివ్ రాగానే,ప్రభుత్వం అందించే మెడికల్ కిట్ తీసుకుని, Home isolation పాటిస్తూ, Pulse oximeterలో saturation levels చూసుకుంటూ మంచి ఆహారం, తగినంత నిద్ర ఉండేట్లు చూసుకుంటే సరిపోతుంది. ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్ 93% కంటే తక్కువ చూపిస్తాయో వారు 104కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి తీసుకెళతారు. అంతవరకు వాళ్ళకి హాస్పిటల్ అవసరమే రాదు.
 
మనదేశంలో మనకున్న జనాభాకు సరిపడా వైద్యులు, ఆస్పత్రులు లేవు. అవసరం లేని వాళ్ళు కూడా అనసరంగా హాస్పిటల్స్‌కి పరుగెత్తడం వల్ల డాక్టర్ల మీద,మెడికల్ సిబ్బంది మీద అధిక శ్రమ పడటమే కాకుండా, నిజమైన అవసరం ఉన్నవారికి వైద్యం అందే పరిస్థితి ఉండదు.
 
జ్వరం వస్తే paracetmol, దగ్గు వస్తే ambroxyl syrup, జలుబుకు citrizen, antibiotic వేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు మాకు ఏమీ కాదు అన్న  ధైర్యం చాలా అవసరం. ఎందుకంటే మన భయమే మనల్ని ఎక్కువ ప్రమాదంలోకి నెట్టేస్తుంది. కాబట్టి Home Isolationలో ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా ఉండండి.
 
ప్రశ్న- డాక్టర్ గారూ మా పక్కింట్లో వాళ్ళకి కోవిడ్ పోజిటివ్ వచ్చింది. మా పాప ఎక్కువగా వాళ్ళింటికి వెళ్లి ఆడుకుంటూ ఉండేది. ఇప్పుడు మా పాపకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా?
 
సమాధానం: ఖచ్చితంగా ఉన్నాయి. కరోనా పోజిటివ్ రాక ముందు మూడ్రోజులు asymptomaticగా వుంటారు. ఈ సమయంలో వాళ్ళతో కలిసి తిరగడం, మాట్లాడటం, వాళ్ళు వాడిన వస్తువులు లాంటివి షేర్ చేసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే పోజిటివ్ వచ్చిన వెంటనే ఐసోలాషన్ లోకి వెళ్లి, వాళ్ళ వస్తువులు వాళ్లే క్లీన్ చేసుకుంటూ సెపరట్‌గా ఉండాలి. ఇంట్లో ఉన్న మిగతా వారు మాస్క్ వాడటం ద్వారా, sanitisation ద్వారా 20 to 30% కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చు.
 
ప్రశ్న: మా నాన్న గారికి బైపాస్ సర్జరీ జరిగింది. 38% మాత్రమే ఫంక్షనింగ్ ఉంది. మరి మా నాన్న గారికి వాక్సిన్ వేయవచ్చా. వేసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా?
 
సమాధానం: తప్పకుండా వేసుకోవాలి. వాక్సిన్ వల్ల సమస్యలు రావడం అంటూ ఉండదు. కానీ ఆయనకు కరోనా వస్తే తట్టుకునే పరిస్థితి వుండకపోవచ్చు. కాబట్టి వ్యాక్సిన్ వేపించడం ఉత్తమం.
 
ప్రశ్న: డాక్టర్ గారు నాకు పోజిటివ్ వచ్చి ఐదు రోజులయింది. నాతో పాటు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు వయసున్న నా ఇద్దరి పిల్లలకి కూడా పోజిటివ్ వచ్చింది. డాక్టర్స్ ఇచ్చిన విటమిన్స్, యాంటీబయటిక్స్ అన్నీ వాడుతున్నాను. కానీ నాకింకా నీరసం తగ్గలేదు. నాకు మళ్లీ మాములుగా అవ్వడానికి ఎంత సమయం పడుతుంది? నేను మళ్ళీ యధావిధిగా బయటకి ఎన్నిరోజుల తర్వాత వెళ్లొచ్చు? నేనీ టైంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? పిల్లలకు ఏమేమి మందులు వాడాలి?
 
సమాధానం: మీకు ఈరోజు పోజిటివ్ వచ్చింది అంటే అంతకు ముందు మూడ్రోజులు కిందట మీ శరీరంలోకి వైరస్ ప్రవేశించినట్లు అర్థం. ఈ వైరస్ ప్రవేశించాక మన శరీరం దానితో పోరాడటానికి సిద్ధమవ్వడంలో భాగంగానే జ్వరం, వొళ్లు నొప్పులు లాంటివి వస్తాయి. వీటి వల్ల ఎలాంటి సమస్యా లేదు.
 
రోజూ మూడు పూటలా పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుని ఆక్సిజన్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ ఆక్సిజన్ 93 కంటే పైన ఉన్నంత వరకు మీకు ఏ ఇబ్బందీ లేదు. 93 కంటే తగ్గుతుంది అంటే మీకు కొంచెం రిస్క్ ఉందని అర్థం. అప్పుడు కూడా భయపడాల్సిన పనిలేదు. హాస్పిటలకు వెళితే  ఆక్సిజన్ అవసరం అయితే పెడతారు.
 
వైరస్ శరీరంలోకి ప్రవేశించాక మొదటి పదిరోజులు జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు పోజిటివ్ వచ్చాక వారం రోజులు. ఈ స్టేజీలోనే ఆక్సిజన్ గమించుకోవడం అవసరం. పది రోజులు దాటాక మీరు దాదాపు రిస్క్ నుండి బయట పడినట్లే. అలాగే 14 రోజుల తర్వాత మీ నుండి వైరస్ స్ప్రెడ్ అవ్వడం అంటూ జరగదు. కాబట్టి మాస్క్ పెట్టుకుని మీరు బయటకి వెళ్లొచ్చు.
 
ఇక ఆహారం అంటూ ప్రత్యేకంగా ఈ ఒక్కరోజే తీసుకుంటే సరిపోదు. పొద్దున తింటే సాయంత్రానికి ఇమ్మ్యూనిటి పెరగడం అంటూ ఏమీ ఉండదు. ముందు నుండి మనం తీసుకున్న ఆహారం బట్టి, మన శరీరతత్వంని బట్టి మన ఇమ్మ్యూనిటి ఉంటుంది. కాకుంటే నీరసం తగ్గించుకోడానికి బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. ఇక పిల్లల విషయానికి వస్తే వాళ్లలో ఇమ్మ్యూనిటి బాగా ఉంటుంది.. కోవిడ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోగలరు.
 
-Dr.C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS), గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్ర చికిత్స నిపుణులు, కర్నూలు. ఆంధ్రప్రదేశ్.