బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 24 ఏప్రియల్ 2021 (16:41 IST)

బెడ్ కావాలంటే రూ. 1,00,000 కట్టాల్సిందే, రోగుల బాధలు కరెన్సీ నోట్లుగా...

గుంటూరు జిల్లాలో పేరుగాంచిన ఆ ఆసుపత్రిలో బెడ్ కావాలంటే రికమండేషన్ తప్పనిసరి. దాంతో పాటే అక్షరాల లక్ష రూపాయల కడితే బెడ్ ఇస్తు రోజుకు 25 వేలు దండుకుంటున్న వైనం. ఇదంతా తెలిసినా అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
 
రోగుల బాధలను కరన్సీగా మార్చుకుంటున్న ఇలాంటి వైధ్యశాలలో తనిఖీ ఉండదు. ఇది బహిరంగ రహస్యం. బాదితుల గోడును బహిరంగంగా చెబితే తక్షణమే బెడ్, రూమ్ వెంటిలేటర్ లేకుండా చేస్తారని భయం. డబ్బులు అప్పులకు తీసుకు వచ్చి ప్రాణాలను కాపాడుకోవాలనే తాపత్రయం ప్రతిఒక్కరికి.
 
ఏమి చేస్తారు. డబ్బు కంటే ప్రాణం ముఖ్యం కాబట్టి. ఇది నిరూపణ కావాలంటే అక్కడికి వెళ్లి బాధిత కుటుంబాలకు చెందిన వారిని ఓదార్చి అడిగితే నిజం ప్రతి ఒక్కరూ అంగీకరిస్తారు. కానీ బహిరంగ చేయొద్దంటూ దణ్ణం పెడుతున్నారు.