శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 24 ఏప్రియల్ 2021 (11:17 IST)

వాలంటీర్ల పనితీరు అద్భుతం: మంత్రి వెలంప‌ల్లి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందించాలనే ముఖ్యమంత్రి ఆలోచనలను సహకారం చేసే వ్యవస్థ ఈ వార్డ్ వాలంటీరి, సచివాలయ వ్యవస్థ అని వారు చేసిన సేవలకు ప్రోత్సహం అందించాలనే ఉద్దేశ్యమే “సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర “ పురస్కారాలు అని మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నందు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వాలంటీర్ల సేవలకు శుక్ర‌వారం నిర్వ‌హించిన సత్కారం కార్య‌క్ర‌మంలో మంత్రి వెలంప‌ల్లి  శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన‌తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నియు నేరుగా లబ్దిదారులకు ఇంటి వద్దనే అందించి వారి కుటుంబoలో ఒక సభ్యునిగా ముద్ర వేసుకోనిన ఘనత వాలంటీర్ల వ్యవస్థ అని పేర్కొన్నారు.

వార్డ్ సచివాలయం వ్యవస్థకు శ్రీకారం చుట్టి వార్డ్  వాలoటీర్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకముల ఫలాలను అందించుటలో వారధిగా ఈ వ్యవస్థ ఉందని,  మీ ద్వారా ప్రతి ఇంటిలో కనీసం రెండు పథకాలు పొందుట జరుగుతుందని, కుల మతాలకు పార్టీలకు అతీతంగా మీరు చేసిన సేవలకు గుర్తింపుగా నేడు ఈ పురస్కార బహుకరణ అని ఇదే స్పూర్తితో  సేవా దృక్పథంతో పని చేయాలని ఆకాంక్షించారు.

మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టి, విధి నిర్వహణలో వారి చేసిన సేవలకు గుర్తింపుగా విశిష్ట సేవా పురస్కారాలు అందజేసే వారిని ప్రోత్సహించుటకు నగరపాలక సంస్థ ద్వారా ఈ కార్యక్రమము ఏర్పాటు చేయుట జరిగిందని అన్నారు. ఎడాది కాలంగా కరోనా వైరస్ ను కూడా లెక్క చేయకుండా ప్రభుత్వ పథకాలను ఎక్కడ వివక్ష లంచాలకు తావులేకుండా సంధానకర్తలా సచివాలయాలు, మరోవైపు వాలంటీర్లు వ్యవస్థ పని చేస్తున్నాయని, గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలు అందించాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు సైన్యం మాదిరిగా వాలంటీర్లు పని చేస్తున్నారని పేర్కొన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకములను ప్రజలకు చేరువ చేస్తూ, వివిధ రకాల పెన్షన్లు 90 శాతానికి పైగా ఉదయానే నేరుగా ఇంటి వద్దనే అందించే ఘనత మీదే అని, అర్హత ఉండి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకములను పొందని వారికి కూడా సంక్షేమ పథకములను అందించేలా ప్రతి ఒక్కరు సేవ దృక్పథంతో చిత్తశుద్దితో పని చేయాలని అన్నారు.

నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలనా అనే ముఖ్యమంత్రి ఆలోచనలకు నిదర్శనమే వార్డ్ సచివాలయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కార్యక్రమములను లబ్దిదారులకు చేరవేయుటలో వాలంటీరి వ్యవస్థ ఎంతో దోహదకారిగా నిలుస్తుందని, విధులలో చూపిన శ్రద్ధ, భద్యత, పని విధానం మొదలగు అంశాలను అనుగుణంగా ప్రభుత్వం సేవ మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర  మూడు కేటగిరీల వారిగా పురష్కారాలు అందించుట జరుగుతుందని తెలియజేసారు.

మొదటి లెవల్ సేవా మిత్ర క్రింద సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జి , రూ.10 వేల నగదు, రెండోవ లెవల్ సేవా రత్న క్రింద సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జి , రూ.20 వేల నగదు మరియు మూడోవ లెవల్ సేవా వజ్ర ద్వారా సర్టిఫికేట్, శాలువా, బ్యాడ్జి , రూ.30 వేల ప్రోత్సాహక నగదు అందించుట జరుగుతుందని పేర్కొన్నారు. కాగా కోవిడ్ దృష్ట్యా నేడు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 5 వార్డ్ సచివాలయల సిబ్బందికి పురస్కారాల అందించుట జరుగుతుందని మిగిలిన వారికీ ఆయా వార్డ్ కార్పోరేటర్ల ద్వారా బహుకరించుట జరుగుతుందని తెలిపారు.

సేవా వజ్ర అవార్డు గ్రహీతలు 5 గురు 1. దుర్గ రాణి యం.  – 51వ వార్డ్ , 2) పి.సురేష్ – 55వ వార్డ్, 3) కె.విజయ హరికదేవి – 56 వ వార్డ్, 4) కె.శ్వేత  – 56వ వార్డ్ 5) యం.భాగ్యరేఖ  – 35వ వార్డ్  సేవా రత్న -6 గురురికి మరియు సేవా మిత్ర అవార్డు క్రింద నియోజకవర్గ పరిధిలోని 790 మందిని పురస్కారాలతో అతిధులు సత్కరించుట జరిగింది.  కార్యక్రమములో పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని పలువురు కార్పొరేటర్లు, ఎస్టేట్ ఆఫీసర్ డా.శ్రీధర్ మరియు ఇతర అధికారులు, సచివాలయాలు సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.