శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 ఏప్రియల్ 2020 (21:49 IST)

అమ్మో ఒకటో తారీఖా!...మాకొద్దు బాబోయ్ వలంటీర్లు

కరోనా ప్రభావం వలన ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యి బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తూ లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారా అంటూ కాలం వెళ్లబుచ్చుతూ పడిగాపులు కాస్తున్నారు.

పేద ప్రజలయితే ప్రభుత్వం పధకాల కోసం ఎదురుచూస్తూ సద్వినియోగం చేసుకుంటున్నారు.ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా సచివాలయం ఉద్యోగులు,వలంటీర్లు తీవ్రంగా ప్రభుత్వ పధకాలను చేరవేస్తూ నిరంతరం శ్రమిస్తూ ప్రజల మన్నలను పొందుతున్నారు.

ప్రతి నెల 1వ తారీఖున పింఛన్లను వలంటీర్లు  తెల్లవారుజామునుంచే ప్రజలకు అందిస్తారు.కరోనా ప్రభావం వలన సచివాలయం ఉద్యోగులతో పాటు వలంటీర్లు కూడా కరోనా బారిన పడటం వలన ప్రజలలో భయాందోలనలు నెలకొన్నాయి.

ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇచ్చేటప్పుడు ఎక్కడ కరోనా సోకుతుందోనని ప్రజలు ఆందోళనలకు గురి అవుతున్నారు. అంతేకాకుండా పొద్దున లెగిసిన దగ్గర నుంచి నిత్యం కరోనా వార్తలే ప్రసారం అవ్వడం వలన ప్రజలు మరింత భయాందోలనకు గురవుతున్నారు.

దీనికి తోడు కరెన్సీ వల్ల కూడా కరోనా వస్తోందని ప్రచారం చేయడంతో ప్రజలందరూ మరింత జాగ్రత్తలు వహిస్తున్నారు. వలంటీర్లు ఇచ్చే కరెన్సీ వలన తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని పింఛన్ దారులు బెంబేలెత్తిపోతున్నారు.

రేపటి రోజున పింఛన్ తీసుకోకపోతే కుటుంభం గడవని పరిస్థితి ఎదురవుతోందని మే1 న వలంటీర్ల దగ్గర పింఛన్ ఎలా తీసుకోవాలని మదనపడుతూ భయందోళనకు  గురిఅవుతున్నారు.
 
కాగా,వలంటీర్లు కూడా ప్రభుత్వ పథకాలు ఇచ్చే సమయంలో ఏదయినా ఉపధ్రువం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా అని తెలిసినా కూడా వృద్దులు తమ మాట వినడం లేదని కనీసం భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారని  వాపోతున్నారు. మే1 న అటు పింఛన్ దారులకు ఇటు వలంటీర్లకు అగ్ని పరిక్షే.