శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (14:50 IST)

పవన్ వ్యవహారశైలి గుడ్డోడు గూట్లో రాయేసినట్టుగా ఉంది : కె నారాయణ నిప్పులు

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి గుడ్డోడు గూట్లో రాయేసినట్టుగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి గుడ్డోడు గూట్లో రాయేసినట్టుగా ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ నిప్పులు చెరిగారు. ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించడాన్ని నారాయణ ఖండించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై పవన్ శైలి గుడ్డోడు గూట్లో రాయేసినట్టు మాట్లాడుతున్నారే తప్ప, హోదా సాధించాలన్న అంకితభావంతో ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. 
 
రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టేందుకు ఢిల్లీలో వెంకయ్యనాయుడు, విజయవాడలో చంద్రబాబు హైడ్రామాలను నడిపించారని విమర్శించారు. తక్షణం కేంద్రం నుంచి బయటకు వచ్చి హోదా సాధనకు తెలుగుదేశం ఎంపీలు ఉద్యమించాలని అన్నారు.