శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (14:09 IST)

ఆంధ్రా ప్రజలతో అర్థరాత్రి డ్రామాలాడుతున్నారు : సీపీఐ రామ‌కృష్ణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్, బీజేపీ నేతలు అర్థరాత్రి డ్రామాలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్, బీజేపీ నేతలు అర్థరాత్రి డ్రామాలాడుతున్నారని సీపీఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. విభజన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఆయన స్పందిస్తూ హోదా, ప్యాకేజీ అంటూ నిన్న‌ అర్థరాత్రి డ్రామా లాడుతారా.. ఆంధ్ర‌ప్ర‌జ‌ల గుండెలు మండుతున్నాయి అని ఆయ‌న అన్నారు. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అని ఉద్ఘాటించారు. 
 
హోదా కోసం త‌మ‌ పోరాటం కొన‌సాగుతూనే ఉంటుంద‌ని రామ‌కృష్ణ స్ప‌ష్టంచేశారు. తెలుగు ప్రజల దృష్టిలో కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు మోస‌గాడిలా మిగిలిపోతారని ఆయన అన్నారు. పార్ల‌మెంటుతో పాటు అనేక స‌భ‌ల్లో ఆనాడు ఏపీకి ప్ర‌త్యేక హోదాపై మాట్లాడిన వెంక‌య్య‌నాయుడు నేడు నీచంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ ఆయ‌న మండిప‌డ్డారు. 
 
అంతకుముందు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా సాధించే క్ర‌మంలో ఏపీ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన ఆందోళ‌న‌లో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు.