శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 5 జనవరి 2021 (20:50 IST)

బీజేపీ, జనసేన పార్టీలు రాజకీయం చేస్తున్నాయి: మధు

ఆలయాల్లో జరుగుతున్న దాడులను బీజేపీ, జనసేన పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఏపీ సీపీఎం కార్యదర్శి పి. మధు విమర్శించారు. మంగళంవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రామతీర్థం వెళ్లారని ఆరోపించారు. దేవాలయాల్లో వరుస దాడులకు పాల్పడుతున్న అసలు దోషులను పట్టుకుని చట్టపరంగా శిక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
అంతర్వేది ఘటనను సీబీఐకి అప్పగిస్తూ ఏపీ సర్కార్ చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న విధ్వంసాలపై సిట్‌తో విచారణ జరిపించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలను కేంద్ర ప్రభుత్వం నీరు గారుస్తోందని విమర్శించారు. దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మధు ఆరోపించారు.