గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 అక్టోబరు 2024 (08:45 IST)

ముంచుకొస్తున్న తుఫాను ముప్పు... 14 నుంచి ఏపీలో భారీ వర్షాలు...

mocha cyclone
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచివుంది. దక్షిణ బంగాళాఖాతంలో శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, ఆ తర్వాత ఇది పశ్చిమ దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుంది. అది ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ నమూనాలు అంచా వేస్తున్నాయి. 
 
తీవ్ర వాయుగుండంగా బలపడి, ఈ నెల 17వ తేదీ నాటికి ఏపీలోనే తీరం దాటొచ్చని భారత వాతావరణ సాఖ భావిస్తుంది. ఇది తుఫానుగా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15వ తేదీ నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తుంది. అల్పపీడనం ఏర్పడ్డాడక దీనిపై స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. కర్నాటక, గోవా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ రెండు లేదా మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, ప్రకాశం, వెస్ట్ గోదావరి, పల్నాడు, సత్యసాయి తదితర జిల్లాలో గురువారం నుంచి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.