బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 25 మే 2017 (11:23 IST)

అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన దాసరి...

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ప్రముఖ సినీ రచయత చిన్నికృష్ణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్‌లు బీజేపీలో చేరారు. అమిత్ షా విజయవాడకు వచ్చిన సందర్భంగా... వీరిద్దరూ ఆయన సమక్షంలో

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ప్రముఖ సినీ రచయత చిన్నికృష్ణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాస్‌లు బీజేపీలో చేరారు. అమిత్ షా విజయవాడకు వచ్చిన సందర్భంగా... వీరిద్దరూ ఆయన సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ, ప్రధాని మోదీ రూపంలో గాంధీ మళ్లీ పుట్టాడనిపిస్తోందని కొనియాడారు. మోదీ పాలన చూసే తాను బీజేపీలో చేరానని చెప్పారు. 
 
కాగా, అమరావతి పర్యటనకు వచ్చిన అమిత్ షా... విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి 13 అంబులెన్సులను ప్రారంభించారు. ఈ అంబులెన్సులను రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు తన ఎంపీ లాడ్స్ నిధులతో కొనుగోలు చేశారు. 
 
సురేష్ ప్రభు ఏపీ నుంచే రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి చంద్రబాబు, అమిత్ షా, వెంకయ్యనాయుడులు ఒకే విమానంలో గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి ఏపీ మంత్రులు ఘన స్వాగతం పలికారు.