శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 28 నవంబరు 2016 (14:22 IST)

కొత్త నోట్ల పండుగ‌... కుమ్మేస్తున్న బ్యాంకు సిబ్బంది... లక్షలకు లక్షలు...

హైద‌బాద్: బ‌్యాంకుల‌లో ప‌నిచేసేవారు ప‌్ర‌తి ఒక్క‌రూ చాలా బిజీగా ఉన్నారు. అవును నోట్ల ర‌ద్దు వ‌ల్ల వ‌ర్క్ లోడ్. బ్యాంకుల బ‌య‌ట బారెడు క్యూలు. కొత్త నోట్లు, చిల్ల‌ర కోసం జ‌నం ఒత్తిడి... అబ్బా బుర్ర వాచిపోతోంది... అంటున్నారు. అయితే, ఇదంతా సిన్సియ‌ర్‌గా

హైద‌బాద్: బ‌్యాంకుల‌లో ప‌నిచేసేవారు ప‌్ర‌తి ఒక్క‌రూ చాలా బిజీగా ఉన్నారు. అవును నోట్ల ర‌ద్దు వ‌ల్ల వ‌ర్క్ లోడ్. బ్యాంకుల బ‌య‌ట బారెడు క్యూలు. కొత్త నోట్లు, చిల్ల‌ర కోసం జ‌నం ఒత్తిడి... అబ్బా బుర్ర వాచిపోతోంది... అంటున్నారు. అయితే, ఇదంతా సిన్సియ‌ర్‌గా బ్యాంకు డ్యూటీలు చేసేవారికి. కొంతమంది బ్యాంకు సిబ్బంది మాత్రం అచ్చంగా నోట్ల ఎక్స్చేంజిలో బిజీ అయిపోయారు. ఇది మ‌న‌కు మోదీ ఇచ్చిన సువ‌ర్ణావ‌కాశం అంటూ, కొత్త నోట్ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నారు. ప‌ర్సంటేజీల‌తో ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు. 
 
సాధార‌ణంగా బ్యాంక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. నిత్యం సాయంత్రం బ్యాలెన్స్... ఏ నోట్లు ఎన్ని అనేది ఆర్బీఐకి మెసేజ్ పంపాలి. వ‌చ్చిన‌, ఇచ్చిన ప్ర‌తి నోటూ లెక్కే. కానీ, అక్ర‌మార్కుల‌కు స‌వాల‌క్ష మార్గాలుంటాయి. కొన్నిబ్యాంకుల్లో యావ‌త్ సిబ్బంది కుమ్మ‌క్క‌యి... కొత్త నోట్ల‌ను దారిమ‌ళ్లిస్తున్నార‌ని స‌మాచారం. 500, వెయ్యి నోట్లు ర‌ద్ద‌యిన కొత్త‌లో భారీ సంఖ్య‌లో జ‌నం బ్యాంకుల‌కు వ‌చ్చి పాత నోట్లు మార్చుకున్నారు. 
 
అప్పుడు వ‌చ్చిన వేలాది క‌స్ట‌మ‌ర్ల ఆధార్ జెరాక్స్‌ల‌ను ఉప‌యోగించి, బ్యాంకు సిబ్బంది 2 వేల నోట్లు, వంద నోట్ల‌ను దారి మ‌ళ్లించార‌ట‌. ఇలా జ‌మ చేసిన కొత్త నోట్ల‌ను 20 ప‌ర్సంట్ క‌మిష‌న్‌తో 80-20 రేషియోలో ఎక్స్చేంజ్ చేశారు. దీనివ‌ల్ల కొంద‌రు బ్యాంకు సిబ్బందికి జీతానికి ప‌ది రెట్లు ప‌ర్సంటేజి సొమ్ములు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. బుద్ధిగా బ్యాంకు జాబ్ చేసేవారికి క‌ష్టం... అడ్డ‌దారులు తొక్కుతున్న‌వారికి క‌రెన్సీ మిగులుతోంద‌ని ఆరోప‌ణ‌లు భారీగా వ్య‌క్తం అవుతున్నాయి. 
 
అయితే, ఇప్ప‌టివ‌ర‌కు బ్యాంకుల‌పై విచార‌ణ‌లు ఏమీ చేయ‌లేదు. కానీ, బ్యాంకుల‌తో పాటు పోస్టాఫీసులకు కూడా పంపిన కొత్త 2 వేల నోట్లను దారి మ‌ళ్లించార‌ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లోని కొన్ని పోస్టాఫీసుల్లో అక్ర‌మాలు సీబీఐ దృష్టికి వెళ్లడంతో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. అక్రమాలు నిజమేనని నిర్ధారించింది. 
 
ఒకవైపు జనం భారీ క్యూలలో నిల్చున్నా నాలుగు కొత్త నోట్లు రావడం లేదని గగ్గోలు పెడుతున్నారు. కానీ, బ‌య‌ట క‌ట్ట‌ల‌కు క‌ట్ట‌లు కొత్త నోట్లు ప‌ట్టుకుని తిరుగుతున్న అక్ర‌మార్కుల ఆట క‌ట్టేదెవ‌రు..?