ఆదివారం, 6 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 24 ఏప్రియల్ 2024 (17:15 IST)

కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది

Kajal Aggarwal    Naveen Chandra
Kajal Aggarwal Naveen Chandra
కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న “సత్యభామ” సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ బిగిన్ అయ్యాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'కళ్లారా..'ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3.06 నిమిషాలకు ఈ పాటను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'కళ్లారా..' పాటను క్వీన్ ఆఫ్ మెలొడీ శ్రేయా ఘోషల్ పాడారు. ఈ పాట కాజల్, నవీన్ చంద్ర లవ్ మేకింగ్ సాంగ్ గా ఉండబోతోంది. “సత్యభామ” సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు.
 
“సత్యభామ” చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా మే 17వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.
 నటీనటులు - కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర, తదితరులు