శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 8 ఏప్రియల్ 2019 (19:39 IST)

గోవిందరాజస్వామి కిరీటాలు దొరికాయ్.. ఎక్కడ..?

తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో మాయమైన కిరీటాల కేసును ఎట్టకేలకు ఛేదించారు అర్బన్ జిల్లా పోలీసులు. కిరీటాలను మాయం చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలోని దాదర్ రైల్వేస్టేషన్‌లో నిందితుడు ఆకాష్ ప్రతాప్ సరోడేని 
చాకచక్యంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
నిందితుడు నాందేడ్ జిల్లా హనుమాన్ మందిర్ జావాల్ కాందార్ ప్రాంతంలో నివాసమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 2వ తేదీ గోవిందరాజ స్వామి ఆలయంలోని అనుబంధ ఆలయం కళ్యాణ వేంకటేశ్వరస్వామికి చెందిన మూడు కిరీటాలు కనిపించకుండా  పోయాయి. 
 
అర్బన్ జిల్లా పోలీసులు ఆరు బృందాలుగా విడిపోయి గత రెండు నెలల నుంచి నిందితుడి కోసం 
గాలిస్తున్నారు. మధ్యాహ్నం నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని ఒక కిరీటాన్ని మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కిరీటాన్ని నిందితుడు కుదవ పెట్టగా, మరో కిరీటాన్ని పగులగొట్టి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచాడు. పాత నేరస్తులందరినీ పోలీసులు విచారిస్తూ వెళుతుండగా అసలు నిందితుడు బయటపడ్డాడు.