శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శనివారం, 19 ఆగస్టు 2017 (17:28 IST)

'గబ్బర్ సింగ్' పార్టీలోకి 'ఖైదీ నెం.150' డైరెక్టర్...

ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలపై ఎప్పటి నుంచో మక్కువ ఉన్న వి.వి.వినాయక్‌కు పవన్ కళ్యాణ్‌ అవకాశం ఇవ్వబోతున్నారట. అది కూడా పార్టీలో కీలక పదవే అంటున్నాయి సినీవర్గాలు. మొదట్లో వి.వి.వినాయక్ అధికార తెలుగుద

ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలపై ఎప్పటి నుంచో మక్కువ ఉన్న వి.వి.వినాయక్‌కు పవన్ కళ్యాణ్‌ అవకాశం ఇవ్వబోతున్నారట. అది కూడా పార్టీలో కీలక పదవే అంటున్నాయి సినీవర్గాలు. మొదట్లో వి.వి.వినాయక్ అధికార తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్నారట. చంద్రబాబు నాయుడుకు వి.వి.వినాయక్‌ల మధ్య ఎప్పటి నుంచో మంచి రాపో ఉంది. 
 
అందరూ మొదట్లో వినాయక్ టిడిపిలో చేరుతారని భావించినా ఆయన మాత్రం జనసేన వైపే ఎక్కువ దృష్టి పెడుతున్నారట. కొత్తగా వస్తున్న పార్టీ అందులోను తాను ఉన్న సినీరంగానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్‌ పార్టీ కాబట్టి అందులోకి వెళ్ళాలన్నది వినాయక్ ఆలోచన. త్వరలోనే ఆయన జనసేనలోకి వెళ్ళనున్నట్లు, ఆ పార్టీలో కీలక పదవిని చేపట్టబోతున్నట్లు సినీపరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
 
గత కొన్నినెలలుగా చేతిలో సినిమాలు లేకపోవడంతో వినాయక్ ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఠాగూర్ లాంటి సినిమాను మళ్ళీ తీయాలన్న ఆలోచనలో వినాయక్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందుకు తగ్గ కథను సిద్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ఇంతలో తనకు ఇష్టమైన రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాలని వినాయక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వినాయక్ జనసేనలోకి వెళితే ఆ పార్టీ మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.