కొత్తగా పంచాయితీల్లో DISPLAY BOARDS.. పారదర్శకతే ధ్యేయం: పవన్ కల్యాణ్ (video)
గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా పల్లె పండుగ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల రూపురేఖలను మార్చనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో పనుల పురోగతి, నిధులు చెల్లింపుపై డిస్ ప్లే బోర్టులు ఏర్పాటు చేశామన్నారు. తాము పారదర్శకంగా ఉన్నప్పటికీ.. అధికారులు కూడా బాగా పని చేయాలి. ఓ ఐఎఫ్‌ఎస్ అధికారి తమ పేరు చెప్పి డబ్బులు అడగినట్లు తెలిసింది. ఈ వ్యవహారం మా దృష్టికి రాగానే విచారణ చేసి, అవసరమైతే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశామని పవన్ అన్నారు.
అవినీతి అధికారులు తమకు వద్దు. ఎవరు లంచం పేరుతో ఇబ్బంది పెట్టినా తమ దృష్టికి తీసుకురండి. ప్రజలకు సేవ చేయడానికే వచ్చాం.. అభివృద్ధి చేయడం మా బాధ్యత. కంకిపాడులో కూడా డిస్ ప్లే బోర్డులు ఉంటాయి. ప్రజలందరు వివరాలు తెలుసుకోవచ్చు.
దేశ చరిత్రలో గ్రామ సభలు, అభివృద్ధి పనులు ఒకేసారి జరగడం ఏపీలోనే చూస్తున్నామని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పరిపాలన ఎలా చేయాలనే అంశంలో తనకు సీఎం చంద్రబాబునాయుడు స్ఫూర్తి అంటూ పవన్ కల్యాణ్ అన్నారు.