మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (15:26 IST)

పవన్‌కు అస్వస్థత - తిరుమల అతిథి గృహంలోనే వైద్య సేవలు

pawan kalyan
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు అస్వస్థతకు లోనయ్యారు. ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం నాడు అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్న ఆయన అస్వస్థతకు లోనైన విషయం తెల్సిందే. ఆ సమంయలో ఆయన వెన్నునొప్పితో బాధపడ్డారు. ఈ క్రమంలోనే బుధవారం శ్రీవారిని దర్శించుకున్న జనసేనాని, రాత్రి తిరుమలోనే బస చేశారు. దాంతో అస్వస్థతకు గురైన ఆయన తిరుమలలోని అతిథి గృహంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. 
 
అనారోగ్యంతో ఉన్నా గురువారం సాయంత్రం తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో ఆయన పాల్గొంటారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. గురువారం సాయంత్రం తిరుపతి బాలాజీ కాలనీ జ్యోతిరావు పూలే కూడలిలో వారాహి బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభలోనే ఆయన వారాహి డిక్లరేషన్ అంశాలను బహిర్గతం చేయనున్నారు. 
 
కాగా, తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెల్సిందే. 11 రోజులపాటు సాగిన దీక్షను బుధవారం శ్రీవారి దర్శనం తర్వాత విరమించిన విషయం తెల్సిందే.