ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (20:35 IST)

అన్న ప్రాసనరోజే కత్తిపట్టిన శ్రీకళ్యాణ్ కుమార్ - కష్టపడే తత్వం వున్నవాడు : అంజనాదేవి ఇంటర్వ్యూ

Srikalyan Kumar, Anjanadevi
Srikalyan Kumar, Anjanadevi
కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుని జనసేప పార్టీ స్థాపించి నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పేరు తెలుసా... శ్రీకళ్యాణ్ కుమార్. పవన్ మాత్రుమూర్తి అంజనాదేవి స్వయంగా వెల్లడిస్తూ తాజాగా జనసేన ఛానల్ జరిపిన చిన్న చిట్ చాట్ లో పలు విషయాలు ఆమె వెల్లడించారు. 
 
ఆమె మాటల్లో... చిన్నప్పుడు వాడికి పెట్టిన పేరు  శ్రీకళ్యాణ్ కుమార్. పెద్దయ్యాక ఎవరో పవన్ అని పెట్టారట. నాకు పెద్దగా తెలీదు.  పవన్ కళ్యాన్ చిన్నతనంనుంచి పెద్దగా మాట్లాడేవాడు కాదు. మౌనంగా వుండేవాడు. వయస్సులో వచ్చాక ఎక్కువగా పుస్తకాలు చదివేవాడు. అది కూడా వారి నాన్న వెంకట్రావ్ అలవాటే అది. నాన్ననుంచి పొందికగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. కుటుంబంలో చిన్నవాడు కనుక పెద్దన్నయ్య చిరంజీవి బాగా చూసుకునేవాడు. అప్పట్లో మేము నెల్లూరులో వుండేవాళ్ళం. పోలీసు ఉద్యోగం కనుక పిల్లలకు చదువులు ట్రాన్స్ ఫర్స్ వుండడంతో పెద్దగా సాగలేదు. అందుకే నేను తీసుకెళ్ళిపోతాను అని చిరంజీవితో చెన్నై వెళ్ళాడు.
 
Amma Manasu
Amma Manasu
పవన్ కళ్యాణ్ అన్న ప్రాసన కార్యక్రమం చాలా చిత్రంగా జరిగింది. యోగ నరసింహాస్వామి గుడిలో అన్నప్రాసన కార్యక్రమం జరిగింది.  ఓ రోజు మేము తిరుపతి దర్శనానికి వెళ్ళాం. కరెక్ట్ గా అప్పటికి పవన్ కు ఆరు నెలలు వచ్చాయి. వెంటనే అక్కడ అన్నప్రాసన చేయించాలి అనుకున్నాను. వారి నాన్నకు చెప్పగానే అంతకంటే మంచి ఇంకేముంటుంది అన్నారు. ఆయన పోలీసు గనుక.  దగ్గర పోలీసు కనుక కత్తి జేబులో వుంటుంది.  కత్తి,  పెన్ను, పుస్తకం పక్కన పెట్టాం. ముందుగా పవన్ కత్తి పట్టుకున్నాడు. తర్వాత పెన్ తీసుకున్నాడు. కత్తిపట్టుకున్నాడంటే ప్రజలకోసం ఏదో చేస్తాడనిపించింది. పెన్నుపట్టుకున్నాడంటే చదువు తక్కువ వస్తుందనుకున్నా.
 
పవన్ కు పలావ్ అంటే ఇష్టం. పెద్దగా తిండేమీద దేస వుండేది కాదు. ఎప్పుడు ఆకలైతే అప్పుడు తినేవాడు. షూటింగ్ నుంచి వచ్చాక సోఫాలోనే కూర్చునేవాడు. బెడ్ రూమ్ కూడా వెళ్ళేవాడు. ఒక్కోసారి అక్కడే నిద్రపోయేవాడు. పవన్ కు చిన్నతనంలో భక్తి లేదు. వారి నాన్నగారు భక్తి చూసి కొంచెంది నేర్చుకున్నాడు. పెద్దయ్యాక అయ్యప్పమాల దీక్ష తీసుకుంటాడు, వారాహి, ఇప్పుడు వేంకటేశ్వరుని మాల వేసుకున్నాడు. ఇప్పుడు భక్తి పెరిగింది. బిడ్డలను ఇలా మంచి మార్గంలో వెళడం అంతకంటే తల్లిగా నాకేం కావాలి.. అంటూ తెలిపారు.
 
ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీకేమి అనిపించింది అన్న ప్రశ్నకు... చిన్నతనంనుంచీ కూడా వాడిలో పట్టుదల ఎక్కువ. అదే ఈ స్థాయికి తీసుకువచ్చిందని అనుకుంటున్నా. తల్లిగా ఆనందించే క్షణం. ఏదైనా ఎవరి అద్రుష్టం వారిది. ఇంతకంటే నేనేమీ చెప్పలేను. కష్టపడాలి, దైవభక్తి వుండాలి. ఉపముఖ్యమంత్రి అవుతాడని తను అనుకోలేదు. మేమే అనుకోలేదు. దేవుడు ఏ స్థాయికి తీసుకెళతాడే ఆయనకే తెలుసు. ఇంకా ప్రజలకు మంచి సేవచేయాలని కోరుకుంటున్నా.. అని ముగించారు.