ఐదు గంటల పాటు కాలినడక.. దీక్షను విరమించనున్న పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 5గంటల కాలినడక తర్వాత కొండపైకి చేరుకున్నారు. రాత్రికి అక్కడే బస చేశారు. డిప్యూటీ సీఎం బసకు, దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లను స్థానిక నేతలు, టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు.
పవన్ కల్యాణ్ మరికాసేపట్లో బస చేసిన అతిథి గృహం నుంచి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఇందుకు టీటీడీ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అనంతరం దీక్ష విరమిస్తారు.
బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. ఆయన వెంట అధికారులు, వ్యక్తిగత భద్రత సిబ్బంది సైతం మెట్ల మార్గంలో తిరుమల కొండకు చేరుకున్నారు.
పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం కాలినడక మార్గంలో కొండపైకి చేరుకున్న సమయంలో ఆయన స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సైతం ఆయన వెంట ఉన్నారు.
ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించిన సమయంలో పవన్ వెంట ఉన్న ఆయన దీక్ష విరమించే సమయంలో కూడా పక్కనే ఉండటం గమనార్హం.