శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 అక్టోబరు 2024 (13:50 IST)

జగనన్న.. పవన్‌ను చూసి నేర్చుకో.. డిక్లరేషన్ ఎంత సైలైంట్‌గా చేశాడో? (video)

Pawan_Daughters
Pawan_Daughters
వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల తిరుమలకు వెళ్లాలనుకున్నారు. లడ్డూ వివాదం నేపథ్యంలో వెంకన్నను అలిపిరి ద్వారా నడుచుకుంటూ వెళ్లి దర్శించాలి అనుకున్నారు. కానీ డిక్లరేషన్ అంశం తెరపైకి రావడంతో జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. జగన్ క్రిస్టియన్ అయినందున, టిటిడి పాలనలో భాగంగా తిరుమల ఆలయాన్ని సందర్శించే ముందు డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయాల్సి ఉంటుంది. 
 
కాగా, తిరుమల ఆలయంలోకి ప్రవేశించే ముందు హిందువులు కానివారు డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిన అవసరం ఏముందని వైసీపీ నేతలు ప్రశ్నించారు. అయితే, అవసరమైన ఫారంపై సంతకం చేసిన తర్వాతే జగన్‌ను ఆలయంలోకి అనుమతిస్తామని టీటీడీ అధికారులు తేల్చి చెప్పారు. సంతకం చేయకుండా లోపలికి అనుమతించబోరని గ్రహించిన జగన్ పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
మరోవైపు బుధవారం తన ప్రాయశ్చిత్త దీక్షను పూర్తి చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి కాలినడకన తిరుమల కొండను ఎక్కారు. బుధవారం ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్నారు. పవన్ వెంట ఆయన కుమార్తెలు ఆద్య, పోలెనా అంజనా పవనోవా ఉన్నారు. అతని చిన్న కుమార్తె హిందువు కాదు కాబట్టి, ఆలయంలోకి ప్రవేశించే ముందు ఆమె డిక్లరేషన్ ఫారమ్‌పై సంతకం చేయాల్సి వచ్చింది. 
 
నిబంధనలకు కట్టుబడి, పోలెనా ఫారమ్‌పై సంతకం చేసింది. తన కూతురు మైనర్ కావడంతో పవన్ ఆ పత్రాలపై సంతకం కూడా చేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధికారిక హ్యాండిల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సోషల్ మీడియా వినియోగదారులు పవన్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంకా వైకాపా చీఫ్ జగన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. సనాతన ధర్మం అంటే అదేనని చెప్తున్నారు.