శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (21:06 IST)

15వ తేదీకి ఈ- ఎం బుక్ సాఫ్ట్వేర్ సిద్ధం కావాలి: అధికారులకు జెఈవో ఆదేశం

ఇంజినీరింగ్ పనుల ప్రగతి, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన పనులు వేగంగా పూర్తి చేయడానికి ఉద్దేశించిన ఈ ఎం బుక్ సాఫ్ట్వేర్ తయారీ పనులు నవంబరు 15వ తేదీకి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

టీటీడీ పరిపాలనా భవనం లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన ఇంజినీరింగ్, విద్యుత్ విభాగం అధికారులతో సమీక్ష జరిపారు.

ఈ ఎం బుక్ సాఫ్ట్వేర్ 15వ తేదీకి పూర్తి అయితే ప్రయోగాత్మకంగా అమలు చేయాలని చెప్పారు. పని జరుగుతున్న ప్రదేశం నుంచే సంబంధిత ఎఈ లు ట్యాబ్ ద్వారా వివరాలు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇందులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని సరిచేసుకోవడానికి టిసీఎస్ సంస్థ తో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

భువనేశ్వర్, సీతంపేట లో జరుగుతున్న ఆలయాల నిర్మాణం పనుల ప్రగతి తెలుసుకున్నారు. కళ్యాణమండపాల. మరమ్మతులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
టిటిడి ఛైర్మన్‌, ఈవో దీపావళి శుభాకాంక్షలు
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి,  శ్రీవారి భక్తులకు మరియు టిటిడి ఉద్యోగుల‌కు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
 
శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని బుధ‌వారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.
 
లోకకల్యాణార్థం నరకాసుర నరకాసుర వధ  జరిగిన విధంగానే కరోనాను కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అంతం చేసి, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని వారు పేర్కొన్నారు.