ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (20:27 IST)

చీకట్లను పారద్రోలి.. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు వెల్లివిరియాలి: చంద్ర‌బాబు దీపావళి శుభాకాంక్షలు

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. చీకట్లను పారద్రోలి.. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు వెల్లివిరిసే దీపావళి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

సరదాలు, సంబరాలు, దీపాల వెలుగులు, బాణాసంచాల జిలుగులతో కుటుంబాలు సంతోషాలతో వెల్లివిరియాలి. దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ.

అందరూ సుఖ సంతోషాలతో జీవించాలి. సిరి సంపదలు, సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వులతో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని ఆశిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.