శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: గురువారం, 23 ఆగస్టు 2018 (22:25 IST)

విశ్రాంతి లేని కారణంగా పవన్ కంటికి మరోసారి శస్త్ర చికిత్స

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ గత నాలుగు నెలలుగా కంటి సమస్యతో బాధపడుతున్నారు. నెల రోజుల కింద‌ట కంటికి ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. త‌గినంత విశ్రాంతి తీసుకోక‌పోవ‌డంతో మళ్లీ ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో పవన్‌కు గురువారం మ‌రోసారి శస్త్ర చికిత్స జ‌రిగింద

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ గత నాలుగు నెలలుగా కంటి సమస్యతో బాధపడుతున్నారు. నెల రోజుల కింద‌ట కంటికి ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. త‌గినంత విశ్రాంతి తీసుకోక‌పోవ‌డంతో మళ్లీ ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో పవన్‌కు గురువారం మ‌రోసారి శస్త్ర చికిత్స జ‌రిగింది.
 
హైద‌రాబాద్ బంజారాహిల్స్ లోని ‘సెంట‌ర్ ఫ‌ర్ సైట్’ కంటి ఆస్ప‌త్రిలో డాక్ట‌ర్ సంతోష్ జి.హోనావ‌ర్, ప‌వ‌న్ కంటికి శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ నెల ఆఖరు వరకు విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు.