శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (14:17 IST)

సైరాలో పూనమ్ కౌర్.. గ్లామరస్‌గా కనిపిస్తుందట..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ''సైరా నరసింహారెడ్డి'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టిన రోజు కా

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో ''ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'' జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ''సైరా నరసింహారెడ్డి'' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి పుట్టిన రోజు కానుకగా విడుదల చేయనున్నట్లు సినీ యూనిట్ ప్రకటించింది. ఈ క్రమంలో ఆగష్టు 21 ఉదయం 11:30 గంటలకు ''సైరా'' మూవీ నెట్టింట్లో సందడి చేయనుంది. 
 
ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్‌, భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న సైరాలో ఓ కీలక పాత్ర కోసం పూనమ్ కౌర్‌ను తీసుకోనున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆడిషన్ కూడా పూర్తయిందని టాక్ వస్తోంది. సైరాలో పూనమ్ కౌర్ గ్లామర్‌గా కనిపిస్తుందని టాక్. ప్రస్తుతం స్వర్ణ ఖడ్గం ధారావాహికలో చేస్తోన్న ఆమె ''శ్రీనివాస కళ్యాణం''లోను కనిపించింది. ఈ నేపథ్యంలో సైరా పూనమ్ కనిపించడం ఖాయమని టాక్ వినిపిస్తోంది.