సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (16:28 IST)

వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

car accident
వైఎస్సార్ కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ప్రయాణికులతో వెళుతున్న ఆటో నుజ్జునుజ్జయింది. 
 
దీంతో ఆటోను నడుపుతున్న మహిళా డ్రైవర్ సహా మొత్తం నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా.. పోలీసులు వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి, వైద్యం అందిస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రొద్దుటూరు నుంచి ఓ ఆటో పది మంది ప్రయాణికులతో మల్లేలకు బయలుదేరింది. ఎర్రగుంట్ల బైపాస్ దగ్గర్లో లారీని క్రాస్ చేసేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించగా.. ఎదురుగా వస్తున్న బస్సు ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో గుర్తుపట్టలేనంతగా ధ్వంసమైంది. అందులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు.