ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2017 (10:12 IST)

కూతురు మెడలో మూడుముళ్లు పడ్డాయి.. తండ్రి ప్రాణాలు విడిచాడు..

ఆ తండ్రి హృద్రోగంతో బాధపడుతున్నాడు. అయినా కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించాలనుకున్నాడు. తన కుమార్తె వివాహానికి బంధువులను ఆహ్వానించాడు. పెళ్లికూడా అనుకున్నట్లే జరుగుతోంది. అంతే పందిరిలో కూతురి మెడలో

ఆ తండ్రి హృద్రోగంతో బాధపడుతున్నాడు. అయినా కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించాలనుకున్నాడు. తన కుమార్తె వివాహానికి బంధువులను ఆహ్వానించాడు. పెళ్లికూడా అనుకున్నట్లే జరుగుతోంది. అంతే పందిరిలో కూతురి మెడలో పెళ్లికొడుకు మూడుముళ్లు వేసిన కొద్దిసేపటికే ఆకస్మికంగా ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన శుక్రవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. మల్యాల మండలం ముత్యంపేట ఎస్సీ కాలనీకి చెందిన మల్యాల లచ్చయ్య, విజయల కుమార్తె రక్షణకు చందుర్తి మండలం లింగంపేటకు చెందిన సంజీవ్‌తో శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరిగింది. వరుడు సంజీవ్‌ వధువు రక్షణ మెడలో మూడు ముళ్లు వేసిన కొద్దిసేపటికే లచ్చయ్య మృతి చెందాడు. దీంతో పెళ్లి జరిగిన ఇంట విషాధం నెలకొంది. కొన్ని నెలలుగా లచ్చయ్య హృద్రోగంతో బాధపడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు.