గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 20 మార్చి 2017 (08:25 IST)

కన్నబిడ్డ చెప్పిన మాట వినడం లేదనీ... తలకిందులుగా చెట్టుకి వేలాడదీత.. కసాయి తండ్రి క్రౌర్యం

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి కన్నబిడ్డను తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి చితకబాదాడు. ఇంతకీ ఆ బిడ్డ చేసిన పాపం ఏంటో తెలుసా... తండ్రి చెప్పిన మాట వినకపోవడమే.

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఓ కసాయి తండ్రి కన్నబిడ్డను తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి చితకబాదాడు. ఇంతకీ ఆ బిడ్డ చేసిన పాపం ఏంటో తెలుసా... తండ్రి చెప్పిన మాట వినకపోవడమే. దీనికి ఆ కసాయి తండ్రి వేసిన కఠిన శిక్ష తలకిందులుగా చెట్టుకు వేలాడదీయడం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు సుబ్బారాయుడు కాలనీకి చెందిన నల్లపూసల శ్రీను అనే వ్యక్తి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. చేపలు, చేలలో ఎలుకలను పట్టుకుని జీవించే శ్రీను మద్యంతాగొచ్చి భార్యా పిల్లలను హింసిస్తుంటాడు. శ్రీను రెండో కుమార్తె (9) మేరీని శనివారం కాళ్లు, చేతులు కట్టేసి ఇంటి ఎదురుగా ఉన్న చెట్టుకొమ్మకు వేలాడదీశాడు. 
 
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని మందలించి మేరీని విడిపించారు. అయితే బాలికకు వాతలు పెట్టినట్లు తెలియడం, శ్రీను మళ్లీ గొడవ చేస్తుండటంతో ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారికి, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు స్థానిక పోలీసులతో చ్చి శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో కుమార్తె తన మాట వినకపోవడం వల్లే చెట్టుకు వేలాడదీసి, వాతలు పెట్టినట్టు అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశాడు.