గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:44 IST)

కాకినాడ బీచ్ రోడ్డులో జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ లో మంట‌లు

జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ పరిధిలో బీచ్ రోడ్డులోని జీఎంఆర్ పవర్ ప్లాంట్‌లో ఈ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఉవ్వెత్తున ఒక్క‌సారిగా మంటలు చెలరేగాయి. దీనితో స్థానికులు హాహాకారాలు చేశారు.
 
కాకినాడ బీచ్ రోడ్డులోని ఈ జిఎంఆర్ ప‌వ‌ర్ ప్లాంట్ గత 5 సంవత్సరాల నుండి మూతపడి ఉంది. అయితే, ఈ రోజు ఆ పవర్ ప్లాంట్‌లో వెల్డింగ్ చేస్తుండగా, నివ్వు రవ్వలు ఫైబర్ షిట్‌పై పడటంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.

అయినా ద‌ట్టంగా మంట‌లు, న‌ల్ల‌టి పొగ వ్యాపించ‌డంతో స్థానికులు బెంబేలు ప‌డుతున్నారు. మంట‌ల‌ను అదుపు చేసేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని అగ్నిమాప‌క సిబ్బంది చెపుతున్నారు. పెద్ద ప్ర‌మాదం ఏమీ ఉండ‌ద‌ని, మంట‌లు అదుపులోకి వ‌చ్చేస్తాయ‌ని తెలిపారు.