ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 17 డిశెంబరు 2020 (07:23 IST)

కరోనాకు మందు నీ అల్లుడు కంపెనీదా? నీ కంపెనీదా?: విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి ఫైర్

ప్రపంచంలోనే వ్యాక్సిన్ వుందో లేదోనన్న అనుమానంలో ప్రజలుంటే విజయసాయిరెడ్డి  గందరగోళానికి గురి చేస్తున్నారని మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్ మండిపడ్డారు.  ఈ మేరకు ఆయన వీడియో సందేశం పంపారు.

ఏ కంపెనీ వ్యాక్సిన్ ఇస్తుందో సమాచారం లేకుండా ట్విట్లరో ఎలా పెట్టారని ప్రశ్నించారు. గాలి ప్రచారం చేయడంలో విజయసాయిరెడ్డిది అందివచ్చిన చేయి అని ఎద్దేవా చేశారు. కరోనాకు వ్యాక్సిన్ ఆయన అల్లుడు కంపెనీదా? లేక సూస్కేట్ కంపెనీదా? చెప్పాలని నిలదీశారు.

జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో అసత్యాలు, అబద్ధాలతో పరిపాలిస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డి తప్పుడు లెక్కలతో చార్టెడ్ అకౌంటెడ్ గా వచ్చి కంపెనీల లావాదేవీలను మరుగున పడేసి కొత్త అవతారం ఎత్తారన్నారు. ఊసరివెళ్లి లాగా అన్ని అవతారాలను విజయసాయిరెడ్డి ఎత్తుతున్నారని,  కరోనాకు డిసెంబరు 25న మందు ఇస్తామని ఎవరి అనుమతితో ట్వటిర్లో పెట్టి తర్వాత తీసేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

వ్యాక్సిన్ పేరుమీద ఎన్నికలు వాయిదా వేసిన పరిస్థితి ఒకవైపు ఉంటే 25వ తేదీన వ్యాక్సిన్ ఇస్తామని చెప్పి ట్విట్టర్ నుండి తొలగించడం మీ అవగాహన ఏంటో తెలుస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలను మోసం చేయడానికి పేటెంట్ హక్కలు తీసున్నారని విమర్శించారు.

‘‘108 వాహనాలు మీ అల్లుడు కంపెనీ ద్వారా కొనుగోలు చేసారు. వ్యాక్సిన్ కూడా బ్రోకరైజ్ చేసి డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు. విజయసాయిరెడ్డి ఊసరవెల్లి రాజకీయాలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. వ్యాపారం రాజకీయం రెండు ఒక చోట ఉండవనే విషయం గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్ అంశాన్ని ట్విట్టర్ నుండి ఎందుకు తీశారో సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.