శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2020 (17:12 IST)

వందకే నాలుగు రకాల పండ్లు: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో అటు పండ్ల రైతులు నష్టపోకుండా, ఇటు ప్రజలకు తక్కువ ఖర్చులో పండ్లు లభ్యమయ్యేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా వంద రూపాయలకే నాలుగు రకాల పండ్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఈ పండ్లను పంపిణీ చేయనుంది.

ఈ మేరకు గురువారం ఉదయం విజయవాడలోని భవానీపురంలో మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ప్రజలకు వంద రూపాయలకే నాలుగు రకాల పండ్లను అందజేయాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్టు తెలిపారు. సిఎం ఆదేశాల మేరకు తాము పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు.