బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 మే 2024 (21:08 IST)

సూర్యలంక బీచ్‌కు వెళ్లారు.. ఇద్దరు యువకులు మునిగిపోయారు..

హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు యువకులు బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో వాగులో కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ఆరుగురు యువకులు బుధవారం ఉదయం ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంక బీచ్‌కు వెళ్లారు. 
 
హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా నల్లమడ వాగు వద్ద స్నానానికి దిగారు. వారిలో ఒకరు బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కూడా కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మత్స్యకారులు, ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టారు.
 
సన్నీ, సునీల్ అనే ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీయగా, గిరి, నందు అనే మరో ఇద్దరి కోసం  గాలిస్తున్నారు. నలుగురు యువకులు వేసవి సెలవుల కోసం ఆంధ్రా వెళ్లారు.