ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 23 ఏప్రియల్ 2017 (16:41 IST)

పవన్ కళ్యాణ్‌తో చేతులు కలుపుతా : ప్రజా గాయకుడు గద్దర్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపి పని చేయనున్నట్టు ప్రజా గాయకుడు గద్దర్ ప్రకటించారు. దీనికంటే ముందుగా తాను రాజకీయ పార్టీని ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పవన్ క

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో చేతులు కలిపి పని చేయనున్నట్టు ప్రజా గాయకుడు గద్దర్ ప్రకటించారు. దీనికంటే ముందుగా తాను రాజకీయ పార్టీని ప్రారంభించాల్సి ఉందన్నారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ తనకు చిరకాల మిత్రుడన్నారు. పైగా, ఇటీవలి కాలంలో జనసేన పార్టీ పేరు బాగా వినిపిస్తోందని అన్నారు. తన సొంత పార్టీ గురించి తొలుత ఆలోచిస్తానని... ఆ తర్వాతనే పవన్‌తో కలసి పనిచేసే అంశం గురించి ఆలోచిస్తానని చెప్పారు. 
 
రాజకీయాల్లోకి రావడంలో తప్పులేదని... ఎప్పడూ తుపాకీ పట్టుకునే ఉండాలా అని గద్దర్ ప్రశ్నించారు. రాజ్యాధికారం అన్నింటికన్నా ముఖ్యమని... ఓటు ఎన్నటికీ ఆయుధమే అని చెప్పారు. ఇందిరాపార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను తరలించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సారథ్యంలోని తెరాస సర్కారు యత్నిస్తుండటం సరైనది కాదని... ప్రభుత్వం ఇలాగా ముందుకు సాగితే ప్రతి ఇంటిని ఒక ధర్నా చౌక్ చేయాలని గద్దర్ పిలుపునిచ్చారు.