గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2017 (10:40 IST)

వైజాగ్‌లో కీచకపర్వం... స్టార్ హోటల్ ఉద్యోగినికి మద్యం తాపించి...

సముద్రతీర ప్రాంతం వైజాగ్‌లో కీచకపర్వం జరిగింది. విధులు ముంగిచుకుని ఇంటికి వెళుతున్న ఓ స్టార్ హోటల్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో అపస్మారక స్థితిలోకి జారుకున్న ఆ య

సముద్రతీర ప్రాంతం వైజాగ్‌లో కీచకపర్వం జరిగింది. విధులు ముంగిచుకుని ఇంటికి వెళుతున్న ఓ స్టార్ హోటల్ ఉద్యోగినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో అపస్మారక స్థితిలోకి జారుకున్న ఆ యువతిని బీచ్ రోడ్డులో వదిలిపెట్టి పారిపోయారు. విశాఖపట్టణంలో సంచలనం రేపిన ఈ గ్యాంగ్ రేప్ కేసు వివరాలను పరిశీలిస్తే... 
 
స్థానికంగా ఉండే ఓ స్టార్ హోటల్‌లో ఓ యువతి పని చేస్తోంది. ఈమె తన విధులు ముగించుకుని ఇంటికి వెళుతుండగా, కారుతో వెంబడించిన ఇద్దరు యువకులు... కారు ఎక్కకపోతే చంపుతామంటూ బెదిరించారు. దీంతో భయపడిన ఆ ఉద్యోగిని కారు ఎక్కింది. ఆ తర్వాత ఆమెకు మద్యం తాపించి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అనంతరం స్పృహలేని స్థితిలో ఉన్న యువతిని బీచ్‌రోడ్‌లో వదిలేశారు. కాగా... అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు యువతిని గమనించి ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ఈనెల 4వ తేదీన చోటుచేసుకుంది. అత్యాచారానికి పాల్పడ్డ యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.