బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 21 జులై 2021 (19:29 IST)

జప్తు చేసిన వాహనాల క్లియరన్స్ కై గన్నవరం పోలీసుల చర్యలు

గన్నవరం పోలీస్ స్టేషన్ లో జరిగిన వివిధ నేరాలకు సంబంధించి, వాహనాలను కూడా జప్తు చేసి కోర్టుకు నివేదించడం జరిగింది. దీనిలో వాహనాలను తిరిగి పొందగలిగిన కేసులు అనగా రోడ్ ప్రమాదాల కేసులు, పేకాట కోడిపండాల కేసులు, లాక్ డౌన్ కేసులు మొదలగునవి సుమారు 70 వాహనాల వరకూ ఉన్నాయి.

సంబంధిత వాహనదారులు కోర్టు ద్వారా సదరు వాహనములను తక్ష్ణమే తగు ష్యూరిటీలు సమర్పించి, తిరిగిపొందవలనదిగా గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్, కోమాకుల శివాజీ సూచించారు. 

సరైన నిర్వహణ లేకుండా పోలీస్ స్టేషన్ లో ఉండిపోవడం వల్ల వాహనం యొక్క జీతకాలం కూడా తగ్గిపోయే  అవకాశం ఉందని, కావున తక్షణమే వాహనములు తిరిగి పొందుటకు వాహనదారుల గుర్తించి,  వాహనాలను తిరిగి వారికి అప్పగించుటకు తగు చర్యలు తీసుకుంటునట్లు సి‌ఐ తెలియచేసారు.