శనివారం, 15 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (12:13 IST)

ప్రేమికుల దినోత్సవం రోజున అమానుషం.. యువతిపై యాసిడ్ పోసి కత్తితో దాడి (Video)

acid victim
ప్రేమికుల దినోత్సవం రోజున అమానుష ఘటన చోటుచేసుకుంది. గౌతిమి అనే యువతిపై కిరాతక ప్రేమికుడు యాసిడ్‌తో దాడి చేసి కత్తితో దాడి చేశారు. తలపై కత్తితో పొడిచి మొహంపై యాసిడ్ పోసి పారిపోయాడు. యువతి పెళ్లి నిశ్చయం కావడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో జరిగింది. 
 
బాధిత యువతిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి  ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న కిరాతక యువకుడు కోసం గాలిస్తున్నారు. ఏకపక్షంగా ప్రేమిస్తూ వచ్చిన ఈ యువకుడు గౌతమిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే, యువతి తల్లిదండ్రులు మాత్రం మరో యువకుడితో పెళ్లి నిశ్చయించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.