శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 20 మే 2019 (11:32 IST)

అనుమానం హత్యకు కారణమైంది.. భార్యను చేతబడి చేసి చంపేశాడని?

అనుమానం ఓ హత్యకు దారితీసింది. చేతబడి చేసి తన భార్యను చంపేశాడని కక్ష పెంచుకున్న వ్యక్తి అదను చూసి ఓ వృద్ధుడిని హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండం బొడ్డుగూడెంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బొడ్డుగూడెంలో గ్రామానికి చెందిన సొంది భద్రయ్య భార్య సొంది గంగమ్మ గత నెల 16వ తేదీన మృతిచెందింది. గ్రామానికి చెందిన తాటి కన్నయ్య (60) చేతబడి చేయడం వల్లే తన భార్య చనిపోయిందని భద్రయ్య అతనిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో కన్నయ్యను చంపేయాలని నిర్ణయించి నాగరాజు అనే స్నేహితుడి సాయం కోరాడు.
 
ఇద్దరు కూడబలుక్కుని ఈనె 6వ తేదీన పనివుంది రావాలంటూ కన్నయ్యను ఇంటికి పిలిపించారు. ఇంటికి వచ్చిన కన్నయ్యను ఒకరు కాళ్లు పట్టుకోగా మరొకరు గొంతు నులిమి చంపేశారు. 
 
అనంతరం శవాన్ని పులివాగులోని ఇసుకలో పాతిపెట్టేశారు. కొద్దిరోజులకు మృతదేహం బయటకు తేలడంతో ఈనెల 13న స్థానిక వీఆర్‌ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో కన్నయ్యను భద్రయ్య, నాగరాజు హతమార్చారని తేలడంలో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.