సోమవారం, 14 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఏప్రియల్ 2025 (19:49 IST)

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

Malabar
Malabar
మచిలీపట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో చోరీకి గురైంది. మాస్క్ ధరించిన గుర్తు తెలియని వ్యక్తి కడియాలు చూస్తూ ఒకదాన్ని జేబులో వేసుకుని జారుకున్నాడు. రెండు రోజుల క్రితం 30 గ్రాముల బంగారు కడియం చోరీకి గురైందని షాపు యజమానులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు. మెల్లగా గాజు గ్లాస్‌లోని బంగారు కడియాన్ని మాస్క్ ధరించిన వ్యక్తి దొంగలించాడు. షాపు దుకాణదారులు తమ తమ పనుల్లో వుండగా మెల్లగా గాజు బాక్సులోని బంగారు కడియాన్ని దోచుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.