రూపాయి ఖర్చులేదు.. ఉచితంగా బోరు బావుల తవ్వకం.. రైతులకు పండుగే
ఏపీలో వైకాపా సర్కారుకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో సీఎం జగన్ రెడ్డి రైతులకు వరాల వర్షం కురిపిస్తున్నారు. రైతుల కోసం మరిన్ని హామీల అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా నవరత్న హామీల్లో భాగంగా రాష్ట్రంలో ఉచిత బోరు బావుల తవ్వకానికి ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా సరే... తమకు ఉచితంగా బోరు బావి కావాలని అనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా ఈ ప్రయోజనం కలుగుతుందని సీఎం ప్రకటించారు. రూపాయి ఖర్చులేకుండా అర్హత పొందిన రైతులు... బోరుబావిని తవ్వించుకొని ప్రతి ఎకరాన్నీ పండించాలన్నదే జగన్ సర్కారు ఆశయం.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
* గ్రామ సచివాలయంలో ఇంటర్నెట్‌లో దరఖాస్తు ఫారంను పూర్తి చేయాలి. పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ ఫొటో, ఆధార్ కార్డు జిరాక్స్ ఫొటోను ఆన్‌లైన్‌లో సమర్పించాలి. అప్లికేషన్లను పరిశీలించాక... అధికారుల నుంచి అనుమతి లభిస్తుంది. ఆ తర్వాత డ్రిల్లింగ్ కాంట్రాక్టర్, భూ పరిశోధకులు వచ్చి... ఎక్కడ నీరు ఉందో చెక్ చేస్తారు. నీరు ఉన్న చోట బోరు బావిని తవ్వి, పని పూర్తి చేస్తారు.
* 5 ఎకరాల దాకా భూమి ఉండి, బోరు బావి లేనివారు.
* కనీసం 2.5 ఎకరాల భూమి కలిగినవారు.
* ఇద్దరు, ముగ్గురు రైతులు కలిసి కూడా అప్లై చేసుకోవచ్చు.