శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జులై 2020 (13:10 IST)

ముంబైలో దారుణం.. మహిళ గొంతు కోసి మృతదేహంపై అత్యాచారం..

కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినా.. కామాంధుల ఆగడాలు తగ్గట్లేదు. షాపింగ్ చేసేందుకు వచ్చిన మహిళపై ఓ కామాంధుడు దారుణానికి పాల్పడ్డాడు. షాపింగ్ చేసేందుకు వచ్చిన మహిళను గొంతు కోసి చంపాడు. అంతటితో ఆగకుండా ఆమె మృతదేహంపై అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన ముంబైలో వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబై నగరంలోని నలసోపారాకు చెందిన ఓ 25 ఏళ్ల మహిళ జూన్ 26న ఇంటిలో నుంచి కిరాణ సామగ్రి తెచ్చేందుకు వెళ్లింది. ఈ క్రమంలోనే తన పిల్లలకు బొమ్మలు కొనేందుకు ఆ మహిళ ఓ బొమ్మల దుకాణంలోకి వెళ్లింది. ధర విషయంలో మహిళా దుకాణ యాజమానితో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆగ్రహించిన దుకాణ యజమాని మహిళను జుట్టు పట్టుకని దుకాణం వెనుక ఉన్న గదిలోకి లాక్కెళ్లాడు. మహిళ అరుస్తుండగా గొంతు కోసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం మహిళ మృతదేహాన్ని ఓ వ్యానులో ఎక్కించి రహదారి పక్కన ఆపి వుంచాడు. అయితే మహిళ ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో పాలు అమ్ముకుని జీవనం సాగించే ఆమె భర్త నలసోపారాలోని తులింగ్ పోలీసులకు తన భార్య తప్పి పోయిందని ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనం నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది.