ఆదివారం, 5 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 జులై 2020 (15:03 IST)

హనుమంతునికి శనీశ్వరుని వాగ్ధానం.. (video)

ప్రతీరోజూ దేవతా పూజకు అనుకూలమే. అదీ శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామికి, విష్ణు ఆరాధనకు, నారాయణ స్వామి ఆరాధనకు ఉత్తమైన రోజు. అలాగే శనివారం శనిభగవానుని పూజకు ఉత్తమమైనది. అంతేగాకుండా శ్రీ హనుమాన్‌ను శనివారం పూజించడం ద్వారా అష్టైశ్వైర్యాలు చేకూరుతాయి. శనిదోషాలుండవు. ఈ రోజున హనుమాన్‌ని ఆరాధించడం సమస్త కోరికలు నెరవేరుతాయి. 
 
ఇంకా శని గ్రహంతో ఏర్పడే ప్రతికూల ఫలితాలను తగ్గించుకోవాలంటే.. శనివారం సూర్యోదయానికి ముందే హనుమంతుడిని ఆరాధించాలి. హనుమంతుడిని మంగళవారం కూడా పూజించవచ్చు. కానీ శనివారం పూట చేసే హనుమంతుని ఆరాధనతో శనిగ్రహానికి సంబంధించిన సమస్త దోషాలుండవు. రామాయణంలో రావణాసురుడు నవగ్రహాలను బందీ చేస్తాడు. 
 
అయితే ఈ నవగ్రహాలను హనుమంతుడు విడిపిస్తాడు. ఆ సమయంలోనే హనుమంతునికి శనీశ్వరుడు వాగ్ధానం చేశాడు. హనుమంతుడిని పూజించే వారికి ఏలినాటి, అర్ధాష్టమ దోషాల ప్రభావం వుండదని.. సమస్త శనిదోషాల ప్రభావం హనుమ భక్తులకు వుండదని హామీ ఇచ్చాడు. 
Lord Shani
 
అందుకే శనివారం హనుమంతుడిని ఆరాధించిన వారి కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే శనివారం పూట హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. అలాగే సుందరకాండ చదవడం ద్వారా ప్రత్యేక ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.