ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (21:46 IST)

ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేరాలి: చినజీయర్‌ స్వామి

పేద మధ్య తరగతి ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ విధానాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగాలని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డి ఆకాంక్షించారు.

మంగళవారం తాడేపల్లి మండలం సీతానగరంలో చిన జీయర్‌ స్వామిజీని కలిసి తమ అభీష్టాన్ని నివేదించారు. స్వామీజీ ఆశీస్సులు స్వీకరించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలని అభిలషించారు.

అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలుంటాయన్నారు.

రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న వినూత్న విధానాలకు దేవతల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని సుబ్బారెడ్డి దంపతులు అన్నారు. వారి ఆకాంక్షలు నెరవేరాలని చిన జీయర్‌ స్వామిజీ ఆశ్వీరదించారు.