ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: బుధవారం, 21 జులై 2021 (14:44 IST)

హోం మంత్రిని క‌లిసిన గ్రేటర్ విశాఖ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్

గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు ఏపీ హోంమంత్రి సుచరితని మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు బ్రాడిపేటలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో మేకతోటి సుచరిత ను కలిసి పుష్పగుచ్చం అందించారు.

చైర్మన్ వెంకటేశ్వర రావుతో పాటు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు కూడా హోంమంత్రిని కలిసారు. విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన వెంకటేశ్వర రావుకు హోంమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు.

గ్రేట‌ర్ విశాఖ‌ను స్మార్ట్ సిటీగా మ‌రింత అభివృద్ధి చేయాల‌నే త‌లంపుతో చిత్త శుద్ధితో ప‌నిచేస్తాన‌ని గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గన్నమని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. హోం మంత్రిగా ఒక మ‌హిళ‌ను నియ‌మించిన సీఎం జ‌గ‌న్ ఆశీస్సుల‌తో పనిచేస్తాన‌ని తెలిపారు.