శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఏప్రియల్ 2021 (11:07 IST)

అమరావతి స్మార్ట్ సిటీ కోసం రూ.360 కోట్ల రూపాయల కేటాయింపు

అమరావతి స్మార్ట్ సిటీ కోసం ఏపీ సర్కారు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏఎమ్మార్డీఏ నుంచి అమరావతి స్మార్ట్ సస్టయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కు పనులు బదలాయించబుతున్నారు. అమరావతి పరిధిలోని 10 ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యతలను సస్టయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కు అప్పగించారు. 
 
అదే విధంగా పది ముఖ్యమైన ప్రాజెక్టులతో పాటుగా మరో కొత్త ప్రాజెక్టు నిర్మాణం బాధ్యతలను కూడా ఈ సస్టయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ కు అప్పగించనున్నారు. ఈ పనుల కోసం రూ.360 కోట్ల రూపాయలను గ్రీన్ ఛానల్ ద్వారా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 
 
అమరావతి శాసన రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు అనుసంధానం కోసం కృష్ణా కుడు గట్టున 15.5 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణను చేయబోతున్నారు. స్మార్ట్ వార్డులు, స్మార్ట్ పోల్స్ నిర్మాణం తదితర ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఈ నిధులను ఖర్చు చేయబోతున్నారు.