మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (22:10 IST)

అబ్బా ఎండలు.. కరోనాతో తిప్పలు.. ఇక వర్షాలు వచ్చేస్తున్నాయ్!

అసలే ఎండలు భగ్గుమంటున్నాయి. కరోనా ఓవైపు ఎండలు మరోవైపు తెలుగు రాష్ట్ర ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంటే.. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.

అదేంటంటే..? దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి స్థిరంగా కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం వెల్లడించారు.

ఇది ఆగేయ దిశగా మయన్మార్‌ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. 
 
దక్షిణ ఒడిశా, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపారు.

దక్షిణ కోస్తాంధ్రాలోని పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొన్నారు.