గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (14:59 IST)

ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ట్రస్టుకు దేవాదాయ శాఖ నోటీసులు

dhulipalla
ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టుకు ఏపీ ప్రభుత్వ దేవాదాయ శాఖ నోటీసులు జారీచేసింది. ట్రస్టును ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ట్రస్టు వ్యవహారం ఇప్పటికే న్యాయస్థానంలో కేసు విచారణ దశలో ఉంది. అయితే, ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోరాదంటూ కోర్టు గతంలో ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే, ఈ కేసు విచారణ ఈ నెల 29వ తేదీన విచారణకు రానుంది. ఈ లోగా మరోమారు సెక్షన్ 43 కింద దేవాదాయ శాఖ నోటీసులు జారీచేసింది. 
 
మరోవైపు, కేసు కోర్టు విచారణలో ఉండగా, ఇపుడు కొత్తగా నోటీసులు ఇవ్వడం అంటే న్యాయ ఉల్లంఘనేనని తెలుగుదేశం పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు. ఇది కక్ష సాధింపు చర్యల్లోభాగమేనని వారు మండిపడుతున్నారు. మే 30వ తేదీతో ఈ నోటీసులు రూపొందించగా ఇవి ట్రస్టుకు ఆలస్యంగా చేరాయి.