శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 29 జనవరి 2017 (14:10 IST)

పూజ చేస్తున్నట్లు నటించి బంగారాన్ని దోచేసుకున్న దొంగబాబా

దొంగబాబా గుట్టు రట్టు అయ్యింది. గుంటూరులో ఈ ఘటన వెలుగులోకి చోటుచేసుకుంది. గుంటూరులోని ఓ వ్యాపారి నకిలీ పూజారి బారిన పడి యాభై వేల రూపాయల విలువైన ఆభరణాలను కోల్పోయాడు. పూజ చేస్తున్నట్టుగానే చేసి బంగారు ఆ

దొంగబాబా గుట్టు రట్టు అయ్యింది. గుంటూరులో ఈ ఘటన వెలుగులోకి చోటుచేసుకుంది. గుంటూరులోని ఓ వ్యాపారి నకిలీ పూజారి బారిన పడి యాభై వేల రూపాయల విలువైన ఆభరణాలను కోల్పోయాడు. పూజ చేస్తున్నట్టుగానే చేసి బంగారు ఆభరణాలను దొంగ పూజారి మాయం చేశాడు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన శ్రీనివాసరావు అనే వ్యాపారి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకుగాను ఓ పూజారిని పిలిపించాడు.
 
పూజలో కొంత బంగారాన్ని పెట్టాలని నకిలీ పూజారి సూచించాడు. ఈ మాటలను నమ్మిన వ్యాపారి శ్రీనివాస రావు పూజలో యాభైవేల రూపాయాల విలువైన బంగారు ఆభరణాలను పూజలో పెట్టాడు. కాసేపు పూజ చేస్తున్నట్లు నటించిన నకిలీ పూజారి ఆ బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. 
 
పూజ పూర్తైందని చెప్పి నకిలీ పూజారి అక్కడి నుండి పారిపోయాడు. పూజారి వెళ్ళిపోయిన తర్వాత బంగారం మాయమైందన్న విషయాన్ని గ్రహించిన వ్యాపారి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.